Ys Jagan : నేడు ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు కొందరికి మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. కీలక నేతల సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జగన్ చర్చించనున్నారని తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, చేసినా కొర్రీలతో ప్రజలను ఇబ్బందిపెట్టడంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను ప్లాన్ చేయనున్నారు.
పార్టీ బలోపేతంపై...
అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి పార్టీ కమిటీల నియామకంపై కూడా జగన్ ముఖ్యనేతలకు మార్గదర్శనం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడం, అక్రమ అరెస్ట్ లు, కేసులు నమోదు చేయడంపై కూడా చర్చ జరిగే అవకాశముంది.