Ys Jagan : నేడు విజయవాడ కార్పొరేటర్లతో జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు.

Update: 2025-02-05 04:34 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. తమ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో జగన్ సమావేశమై వారితో చర్చించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పార్టీలో కొనసాగితే భవిష్యత్ ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. పార్టీకి నమ్మకంగా ఉన్న వారికే పదవులు కూడా భవిష్యత్ లో వరిస్తాయని చెప్పనున్నారు.

వారికే రాజకీయ భవిష్యత్...
వచ్చేది తమ ప్రభుత్వమేనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదని, రాజకీయ భవిష్యత్ కు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం జగన్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కేసులు పెట్టినా వైసీపీ అండగాఉంటుందని వారికి ధైర్యం చెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.



Tags:    

Similar News