నేడు మండపేట క్యాడర్ తో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో మండపేటలో వైసీపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. వైఎస్ జగన్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. గత ఎన్నికల్లో మండపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు.
టీడీపీ నియోజకవర్గాలతోనే...
ప్రస్తుతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మండపేట పార్టీ ఇన్‌ఛార్జిగా జగన్ నియమించారు. మండపేటలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది జగన్ క్యాడర్ కు సూచించనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలపైనే జగన్ గురి పెట్టినట్లు కనపడుతుంది. ఇప్పటి వరకూ కుప్పం, అద్దంకి, టెక్కలి నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాజాగా మండపేట నియోజకవర్గం కార్యకర్తలతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.