Ys Jagan : నేడు తిరిగి బెంగళూరుకు జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2025-04-24 02:27 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చిన జగన్ పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. నిన్న, ఈరోజు కూడా కొందరు ముఖ్యనేతలతో సమావేశమై జరుగుతున్న పరిణామాలపై జగన్ చర్చించనున్నారు. దీంతో పాటు నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కబందూరు, తిరుపతి రూరల్ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులతో జగన్ సమావేశం కానున్నారు.

న్యాయ సాయం...
ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలు, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు హాజరు కానున్నారు. వరస అరెస్ట్ లతో వైసీపీ నేతలపై కేసులు నమోదవుతుండటంతో వారికి అండగా నిలబడేందుకు లీగల్ సెల్ ప్రయత్నించాలని కోరనున్నారు. లీగల్ గా వారికి అన్ని రకాలుగా సాయం అందించాలని చెప్పారు. అవసరమైన వారికి సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని నేతలను ఆదేశించారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలు తాడేపల్లి నుంచి బయలుదేరి తిరిగి బెంగళూరుకు వైఎస్ జగన్ చేరుకోనున్నారు.


Tags:    

Similar News