Ys Jagan : కాసేపట్లో జగన్ మీడియా సమావేశం.. కీలక నిర్ణయమేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరికాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు

Update: 2025-02-06 03:12 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరికాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరసగా పార్టీ నేతలతో సమావేశమవుతున్న జగన్ వారిలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం పై...
ఈ సమయంలో ఈరోజు ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులపై వివరించే అవకాశముంది. మున్సిపల్ కార్పొరేషన్ పదవుల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరించిన వైఖరిని కూడా ఎండగట్టనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తాను హాజరయ్యే విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది. దీంతో పాటు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.


Tags:    

Similar News