YSRCP: నేడు వైఎస్ జగన్ కీలక భేటీ... ఆ నిర్ణయం తీసుకోనున్నారా?

వైసీపీ అధినేత జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Update: 2025-06-25 01:49 GMT

వైసీపీ అధినేత జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ ఛార్జులతో పాటు ఎమ్మల్యేలతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే తన పర్యటనలపై ఆంక్షలు విధించడంతో పాటు పలు అక్రమ కేసులు నమోదు చేయడంపై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావస్తుండటంతో ఇక ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయడానికిఅవసరమైన ఫీడ్ బ్యాక్ ను తీసుకోనున్నారు.

ప్రజల్లోకి వెళ్లడంపై...
ఏ ఏ అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. కేవలం హామీలు మాత్రమే కాకుండా ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో చర్చ పెట్టేలా కార్యక్రమాలను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పొదిలి, సత్తెనపల్లిలో పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా తాను కూడా ఇకపై జరిగే ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే నేడు వైసీపీ నేతలతో జగన్ సమావేశం కీలకంగా భావిస్తున్నారు. ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News