Ys Jagan : నేడు పులివెందులకు జగన్... నాలుగు రోజుల మకాం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందులకు రానున్నారు. నాలుగు రోజుల పాటు పులివెందులలోనే ఉంటారు.
ys jagan
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందులకు రానున్నారు. నాలుగు రోజుల పాటు పులివెందులలోనే ఉంటారు. ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు కడపకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళతారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ లో నివాళులర్పిస్తారు. అక్కడ ప్రేయర్ హాలులో ప్రార్థనలు చేసిన తర్వాత కడప జిల్లా నేతలతో సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం పులివెందుల చేరుకుని అక్కడే రాత్రికి బస చేస్తారు.
షెడ్యూల్ ఇదీ...
రేపు ఉదయం 830 గంటలకు పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 తాతిరెడ్డిపల్లెలోలో రామాలయాన్ని ప్రారంభించనున్నారు. రాత్రికి పులివెందులలో బసస్తారు. 26వ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఆయన నివాసంలో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ నెల 27వ తేదీన విజయాగార్డెన్స్ లో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరై అనంతరం బెంగళూరుకు బయలుదేరి జగన్ వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.