Ys Jagan : రెండు రోజులు పులివెందులలోనే జగన్
వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. వైఎస్ జగన్ బెంగళూరు నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి పులివెందులకు ఆ తర్వాత ఇడుపులపాయకు చేరుకోనున్నారు.
ఇడుపుల పాయలో...
ఇడుపుల పాయలో రేపు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. జగన్ పర్యటనలో కార్యకర్తలు, ప్రజలతో నూ సమావేశం కానున్నారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముంది.