Ys Jagan : నేడు తాడేపల్లికి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు.

Update: 2025-05-06 02:26 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి బెంగళూరు నుంచి తాడేపల్లికి సాయంత్రం చేరుకోనున్నారు. విమానాశ్రయంలోనే నేతలు జగన్ కు ఘన స్వాగతం పలకనున్నారు.

రేపు రైతులను పరామర్శించేందుకు...
అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని జగన్ రేపు పరామర్శించే అవకాశాలున్నాయి. మొన్న ఆదివారం భారీ వర్షంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల పంటలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తడిసి పోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. అలాగే మామిడి, అరటి, కూరగాయాల తోటల ధ్వంసం కావడంతో వారికి కూడా పరిహారం భారీగా చెల్లించాలని కోరనున్నారు.


Tags:    

Similar News