Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు

Update: 2025-06-30 03:57 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. ఈరోజు బెంగళూరు నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి జగన్ రాత్రి 7.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 7.40 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

రేపు సీనియర్ నేతలతో...
రేపు పార్టీ సీనియర్ నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యే అవకాశముంది. మూడు వారాల పాటు జరగనున్న చంద్రబాబు హామీలపై పోరాటంపై నేతలతో చర్చించే అవకాశముంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జుల నియామకపై కూడా జగన్ చర్చించే అవకాశముందని తెలిసింది. కొందరు నేతలకే రేపు తాడేపల్లికి రావాలని ఆహ్వానం అందినట్లు సమాచారం.


Tags:    

Similar News