Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు జగన్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికిచేరుకోనున్న జగన్ ఈరోజు ముఖ్య నేతలతో సమావేశమవుతారు.
రేపు ప్రకాశం జిల్లాకు...
రేపు జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లాలోని పొదిలికి చేరుకుంటారు. పొగాకు రైతులతో మాట్లాడతారు. పొగాకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా నిలవడానికి, ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి రేపు జగన్ పొదిలి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ వారి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు.