చంద్రబాబు పాలనపై జగన్ లేటెస్ట్ ట్వీట్ ఏంటంటే?

రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని వైసీపీ అధినతే వైఎస్ జగన్ ట్వీట్ చేశారు

Update: 2025-06-09 02:47 GMT

రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని వైసీపీ అధినతే వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు పాలనలో వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉందన్నారు. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారని, ఈనెల 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జగన్ అన్నారు.

ముందే ఫిర్యాదు చేసినా...
ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారని, తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమేనన్న జగన్, తమ అమ్మాయి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నించారు. ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అని నిలదీశారు. అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? అని ప్రశ్నించారు. కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలని వైఎస్ జగన్ ట్వీట్ లో కోరారు.


Tags:    

Similar News