Ys Jagan : నేడు జగన్ మీడియా సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయంపదకొండు గంటలకు మీడియా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను జగన్ ప్రస్తావించే అవకాశముంది. ముఖ్యంగా రైతుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు చేయనున్నారు.
వివిధ అంశాలపై...
పొగాకు, మిర్చి, మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతుల నుంచి భూముల సేకరణతో పాటు అక్రమ కేసులతో పాటు తన పర్యటనలపై ఆంక్షలను వంటి అంశాలను ప్రస్తావించే అవకాశముంది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయంతో పాటు అప్పుల అంశాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని జగన్ చేయనున్నట్లు తెలిసింది.