Ys Jagan : దీపం పథకం దగా : వైఎస్ జగన్
దీపం కింద మహిళలను నిలువునా మోసం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు
దీపం కింద మహిళలను నిలువునా మోసం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దీపం-2 మోసం, బోగస్ పథకం అని ఆయన అన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకూ ఒక్క సిలిండర్ కూడా అర్హులైన అందరికీ అందించలేదని వైఎస్ జగన్ అన్నారు. మహిళలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. దీపం పథకం కింద ముందు డబ్బులు కట్టి, తర్వాత వారికి నగదు జమ కాని వారు చాలా మంది ఉన్నారని అన్నారు.
ఉచిత బస్సు...
పింఛను దారులలో కూడా ఏడాదిలో ఐదు లక్షల మందిని తొలగించారని వైఎస్ జగన్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు.. అన్నిటికంటే చాలా సులభమమని, ఉచిత బస్సు కోసం తమ కడపలో మహిళలంతా ఎదురు చూస్తున్నారన్న జగన్ ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇస్తే చాలు.. ఫ్రీ బస్సు వస్తుందని అన్నారు. పండగల పేర్లు మారుతున్నాయి.. కానీ ఫ్రీ బస్సు రావటం లేదని జగన్ ఎద్దేవా చేశారు. ఆర్టీసీకి డబ్బు ఇస్తే సరిపోయేదానికి అధ్యయనం ఎందుకు? మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నాడు.. కానీ ఇవ్వలేదంటూ జగన్ ధ్వజమెత్తారు.