Ys Jagan : 76 ఏళ్ల ముసలాయన నన్ను భూస్థాపితం చేస్తాడట
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు
డెబ్భయి ఆరేళ్ల ముసలాయన తనను భూస్థాపితం చేస్తానని చెబుతున్నాడని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనంలోకి వెళ్లడం తప్పా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనిచెప్పారు. పొదిలిలో నలభై వేల మంది ప్రజలు వస్తే.. నలభై మందితో అల్లర్లు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్నారు. పల్నాడులోనూ ఆంక్షలు విధించినా జనాన్ని ఆపలేకపోయారన్నారు. డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరం నుంచి వినిపించిందా? అని జగన్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని భావించి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు.
అక్రమ అరెస్ట్ లతో...
చివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మెన్ ను కూడా లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి ప్రమేయం ఉందని అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. చెవిరెడ్డిని ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెడుతున్నారని జగన్ అన్నారు. రెంటపాళ్ల పర్యటన విజయవంతం అవ్వడంతో ఇప్పుడు కేసులు పెట్టి ఏం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తారా? అని జగన్ నిలదీశారు. కర్ఫ్యూలాంటిపరిస్థితులమధ్య తన రెంటపాళ్ల పర్యటన కొనసాగిందని జగన్ అన్నారు. పొదిలి, రెంటపాళ్ల పర్యటనల్లో తనతో పాటు పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నారు.
తప్పుడు సంప్రదాయాలను...
తప్పుడు సంప్రదాయాలను పాటిస్తూ రాష్ట్రాన్ని బీహార్ లా మార్చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రగిరి సొంత నియోజకవర్గం కావడంతో చంద్రబాబు చెవిరెడ్డిపై కక్ష పెంచుకున్నారని వైఎస్ జగన్ అన్నారు. సొంత నియోజకవర్గంలో గెలవలేక కుప్పం పారిపోయిన వ్యక్తి చంద్రబాబు కాదా? అని జగన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారన్నారు. వల్లభనేని వంశీ పై వరస కేసులు పెడుతూ పదకొండు కేసుల్లో ఇరికించారన్నారు. జోగి రమేష్, కృష్ణమోహన్, కాకాణి గోవర్థన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి ఇలా అందరినీఅరెస్ట్ చేశారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్చేయాలని చూస్తున్నారన్నారు. పేర్నినాని విషయంలో తప్పుడు కేసులు పెట్టారన్నారు.