మరో ముప్ఫయేళ్లు రాజకీయాల్లో ఉంటా : జగన్
ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదని హామీలపై జనం నిలదీస్తున్నారని అన్నారు.బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీలా మారిందన్న జగన్ రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడం లేదని అన్నారు. ఏ పని జరగాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని జగన్ తెలిపారు. ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెడతారని కార్యకర్తల నుంచి నేతల వరకూ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
అక్రమ కేసులు బనాయించినా...
అక్రమ కేసులు బనాయించినా వారికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ తెలిపారు. వచ్చేది జగన్ 2.O పాలన అని అన్న ఆయన మరో 25 నుంచి 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. అన్యాయాలకు పాల్పడుతున్నవారిని వదిలిపెట్టబోమన్న జగన్, తప్పుచేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని అన్నారు. పార్టీకి అండగా కష్టకాలంలో నిలబడిన వారికి మాత్రమే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులుంటాయని కూడా తెలిపారు. కార్యకర్తలకు ఈసారి తాము అండగా ఉంటామని జగన్ చెప్పారు.