Ys Jagan : గుంటూరు జిల్లా నేతలతో జగన్ .. కీలక ఆదేశాలు
తాడేపల్లిలో వైసీపీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు.
తాడేపల్లిలో వైసీపీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. కెఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీగా సపోర్ట్ చెయ్యాలని కోరార. గుంటూరు జిల్లా నేతలతోజగన్ సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల పై చర్చించారు. సమావేశానికి హాజరైన లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, విడదల రజినీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని సైలెంట్ గా ఉండొద్దని, కూటమి అభ్యర్థులను ఓడించేందుకు బలమైన అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారని, బలం లేకపోయినా ఆయన పీడీఎఫ్ తరపున పోటీ చేయడానికి మనం మద్దతు ఇవ్వడం వల్లే జరిగిందని తెలిపారు. లక్ష్మణరావు విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. లక్ష్మణరావు గతంలో మనకు సహకరించారన్న జగన్, కూటమికి పోటీ ఇచ్చేది లక్ష్మణరావు అని చూడకుండా వైసీపీ అన్న భావనలో పని చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరారు.