Ys Jagan : విజయసాయిరెడ్డిపై జగన్ ఫస్ట్ కామెంట్స్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ విజయసాయిరెడ్డి రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయాలంటే విలువలు, నైతికత ఉండాలని విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందిస్తూ జగన్ అన్నారు. ఎవరికో భయపడో, ప్రలోభాలకు గురయ్యో పక్కవారి వద్దకు వెళితే అది రాజకీయం ఎందుకవుతందని ప్రశ్నించారు.
ఎవరు వెళ్లిపోయినా...
పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా వైసీపీకి జరిగే నష్టం లేదన్నారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విలువలు ఉండాలన్న జగన్ విజయసాయిరెడ్డికి అయినా.. మరొకరికరికైనా ఇదే వర్తిస్తుందని తెలిపారు. లిక్కర్ కేసులో మిధున్ రెడ్డికి ఏం ప్రమేయం ఉందని ఆయన ప్రశ్నించారు. ఎవరో ఒకర్ని ఇరికించాలని కేసులు పెడుతున్నారన్న జగన్ రాజకీయాల్లో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని అన్నారు.