Ys Jagan : రెంటపాళ్లకు బయలుదేరిన వైఎస్ జగన్.. దారిపొడవునా పోలీసుల మొహరింపు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల బయలుదేరారు. జగన్ కు దారిపొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు

Update: 2025-06-18 05:15 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల బయలుదేరారు. జగన్ కు దారిపొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అభిమానులు వెళ్లకుండా పోలీసులు ఎక్కడకక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల, గురజాల నుంచి వస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారన్నారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ చుట్టూ 25 మంది చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నేడు రెంటపాళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఉండటంతో ఉద్రిక్తత కొనసాగే అవకాశముండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు.

అన్ని దారుల్లో...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లి వెళ్లే అన్ని దారుల్లో భారీగా పోలీసుల మోహరించారు. పోలీస్ ఆంక్షలు ధిక్కరించి రెంటపాళ్లకు వైసీపీ శ్రేణులు బయలుదేరి వెళుతున్నాయి. అడుగడుగునా బారీకేడ్లు, చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను తప్పించుకునేందుకు పొలాల మీదుగా రెంటపాళ్లకు కార్యకర్తలు బయలుదేరి వెళుతున్నారు. బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్లవైపు వైసీపీ శ్రేణులు వెళుతుండటంతో పోలీసుల సాధ్యం కావడం లేదు.
కార్యకర్తలను కంట్రోల్ చేసేందుకు...
కార్యకర్తలను కంట్రోల్ చేసేందుకు పోలీసుల అవస్థలు పడుతున్నారు. దీంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హైటెన్షన్‌ నెలకొంది. జగన్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్‌ సిబ్బంది యత్నించారు. మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. వందల సంఖ్యలో పోలీసులు మొహరించడంతో పాటు కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతించారని, తమను నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు అనుమతించాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు. మొత్తం మీద పల్నాడులో జగన్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది.




Tags:    

Similar News