Ys Jagan : ఎన్నికల ప్రచారానికి రెడీ అయిన జగన్
వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు
ys jagan
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈనెల పద్దెనిమిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల పద్దెనిమిదన ఇచ్ఛాపురం నుంచి ఆయన ప్రచారం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారయినట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లో నాలుగు సభలను సిద్ధం పేరుతో నిర్వహించిన సంగతి తెలిసిందే.
రోజుకు మూడు సభలు...
అయితే సిద్ధం సభలకు అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించారు. కానీ ఈ నెల పెద్దెనిమిదిన నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటించనున్నారు. ఉదయం ప్రారంభమయ్యే ఆయన పర్యటనలు సాయంత్రం వరకూ కొనసాగుతాయని, రాత్రికి తిరిగి విజయవాడకు చేరుకునేలా సభలను ప్లాన్ చేశారు. తొలి రోజు ఇచ్ఛాపురంలో పాల్గొన్న అనంతరం విజయవాడ , వెస్ట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ఈలోపు మ్యానిఫేస్టో విడుదల చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. పదహారోతేదీన ఇడుపులపాయకు వెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.