Ys Jagan : ఇడుపుల పాయకు చేరుకుని జగన్ నివాళులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వైఎస్ జగన్ నిన్ననే బెంగళూరు నుంచి పులివెందులకు చేరుకున్నారు.
రెండు రోజుల పర్యటన...
రెండు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు వచ్చిన జగన్ నేడు ఇడుపుల పాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత పులివెందులలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలసి వినతి పత్రాలను తీసుకోనున్నారు. ఈరోజు సాయంత్రం తిరిగి ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళతారు. ప్రజా దర్బార్ లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.