Ys Jagan : వడ్దీతో సహా చెల్లిస్తాం.. చంద్రబాబుకు జగన్ వార్నింగ్

చంద్రబాబు నాయుడుకు, అధికారులకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2025-07-16 07:30 GMT

చంద్రబాబు నాయుడుకు, అధికారులకు వైసీపీ అధినేత వార్నింగ్ ఇచ్చారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం బెదిరింపులకు ఎవరూ భయపడే వారు లేరన్నారు. కేసులకు భయపడి ప్రశ్నించడం మానుకుంటామంటే అది మీ అవివేకమే అవుతుందని అన్నారు.

ఎన్ని కేసులు పెడితే...
ఎన్ని కేసులు పెడితే అంత ఖచ్చితంగా ఇంకా పెద్ద గొంతుకతో ప్రశ్నిస్తూనే ఉంటామని జగన్ అన్నారు. ఇప్పుడు వేధించిన అధికారులను ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటామని, వారు ఎక్కడ ఉన్నా పట్టి తీసుకు వచ్చి చట్టప్రకారం శిక్షించడం ఖాయమని జగన్ అన్నారు. ఈసారివచ్చేది తమ ప్రభుత్వమేనన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకుని, న్యాయపరంగా వ్యవహరించాలని జగన్ అన్నారు. దెబ్బతిన్న వాళ్లు రేపు తన మాట వినరని, అప్పుడు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని, అది మీ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు.


Tags:    

Similar News