Ys Jagan : వైఎస్ జగన్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.

Update: 2025-07-01 11:58 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. రెంటపాళ్ల కేసులో జగన్ క్వాష్ పిటీషన్ కు సంబంధించి నేడు విచారించిన న్యాయస్థానం జగన్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో తనను ఏ2 నిందితుడిగా చేర్చడాన్నిజగన్ సవాల్ చేశారు. తనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలని ఈ పిటీషన్ లో కోరారు.

రెండు వారాల పాటు...
ఇదే కేసులో నిందితులుగా చేర్చిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని కూడా క్వాష్ పిటీషన్ లు వేశారు.వీటిన్నింటిపై విచారించిన హైకోర్టు పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రబుత్వానికి రెండు వారాల గడువు కోరగా కేసును రెండు వారాల పాటువాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని, అప్పటి వరకూ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News