Ys Jagan : వైఎస్ జగన్ కు హైకోర్టులో స్వల్ప ఊరట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలన్న పిటీషన్ పై విచారించిన హైకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జులై 1వ తేదీన తిరిగి క్వాష్ పిటీషన్ పై విచారణ చేపడతామని చెప్పింది. అప్పటి వరకూ క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన వారిని ఎవరినీ అదుపులోకి తీసుకోవద్దని ఆదేశించింది.
రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో...
జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో సింగయ్య మృతికి జగన్ తో పాటు వాహనంలో ఉన్న వైవీసుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనిలపై కేసు నమోదు చేసింది. దీంతో వేర్వేరుగా తమపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని పిటీషన్ వేయగా వచ్చే నెల 1వ తేదీకి విచారణను వాయాిదా వేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.