Ys Jagan : అంతా అమరావతి మయమేనా? 143 హామీలకు దిక్కూదివానం లేదా?
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రయవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఇస్తారా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ మద్యాన్ని తాగడం తగ్గించడం ద్వారా అమ్మకాలు భారీగా తగ్గాయని అన్నారు. 2019 నుంచి 2024 వరకూ మద్యం విక్రయాలు ఏపీలో గణనీయంగా పడిపోయాయని తెలిపారు. మద్యం తాగించకూడదనే తాము మద్యం ధరలను పెంచామని చెప్పారు. తాగించడం తగ్గడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడామన్నారు. మద్యం దుకాణాలను తమ హయాంలో 33 శాతం తగ్గించామని జగన్ చెప్పారు. ఎవరు కమీషన్ ఇస్తే వారికి మద్యం దుకాణాలు, డిస్టలరీలను ఇచ్చింది చంద్రబాబు హయాంలోనేనని అన్నారు. చిన్న స్థాయి ఎక్సైజ్ ఉద్యోగులను బెదిరించి స్టేట్ మెంట్లను తీసుకుంటున్నారని అన్నారు.