Ys Jagan : చంద్రబాబు సర్కార్ పై జగన్ ఎక్స్ లో ఏమన్నారంటే?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-02-21 02:07 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లి మిర్చి రైతుల సమస్యలపై చర్చించేందుకు ఎందుకు కలరింగ్ ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఆయన ఎక్స్ లో పోస్టు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు వెళుతున్నట్లు చెప్పాల్సిన అవసరం ఏముందని అన్నారు.

మిర్చి రైతులు...
మిర్చి రైతులు తగిన గిట్టుబాటు ధర రాక పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని, వారిని పట్టించుకోకుండా వారికి బాసటగా నిలిచిన తమపై తప్పుడు కేసులు పెట్టడమేంటని నిలదీశారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వారిని పట్టించుకోవాల్సింది పోయి రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. క్వింటాల్ మిర్చిని పదివేలకు తెగనమ్ముకోవాల్సిన దుస్థతి ఈ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడిందన్నారు. వీటన్నింటిపై రైతులకు సమాధానం చెప్పాలని జగన్ అన్నారు.


Tags:    

Similar News