Ys Jagan : ఆంక్షలు పెడితే ఆగుతారా? గిట్టుబాటు ధరలు ఎక్కడ?

మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు

Update: 2025-07-09 11:50 GMT

మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బంగారుపాళ్యం మామిడి రైతులను పరామర్శించిన తర్వాత వెంటనే 76 వేల మంది రైతుల పంట కొనుగోలు చేయాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తన పర్యటనకు రాకుండా మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని అన్నారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని జగన్ తెలిపారు.జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ రెండు వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారన్న జగన్ రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని, చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారని, ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారని ప్రశ్నించారు.

వేలాది మంది రైతులు వచ్చి...
ఎందుకీ ఆంక్షలు? అని నిలదీశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా వేలాది మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారన్న జగన్ రాష్ట్రంలో ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. వరికి కూడా ధర లేదని, కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారని, వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని తెలిపారు. ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రెండు రూపాయలకి దొరుకుతుందా?.అని నిలదీశారు. ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారని, కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం జరిగిందన్నారు. ఏటా మామిడి కొనుగోలు ఉంటుందని, దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలని, కానీ, ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు.


Tags:    

Similar News