ఏపీకి ఆ ముప్పు తప్పింది!!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా

Update: 2024-05-24 06:56 GMT

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 26 తేదీ సాయంత్రానికి మరింత బలపడి తుపానుగా మారనుంది. ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారినా.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాను ముప్పు ఏపీకి లేకపోవడంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. రేమాల్‌ తుపాను ఏపీకి దూరంగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతాల్లో వర్షాలు:
ఏపీలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం నాడు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శని­వా­రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ­కాశం ఉంది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీ­ఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలి­క­పాటి వర్షాలు కురవనున్నాయి.


Tags:    

Similar News