తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి

Update: 2023-09-01 03:44 GMT

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అవ్వనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా వీచే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 2,3,4 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు బలంగా వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బలమైన గాలులు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య​, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఇక బెంగళూరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. వర్షాలతో పాటుగా పిడుగులు, ఉరుములు ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయం వరకు మధ్య ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ​, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. మారేడుమిల్లి - రంపచోడవరం - పోలవరం - యేలేశ్వరం ప్రాంతాల్లో సాయంకాలం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నాయి.


Tags:    

Similar News