Weather Report : నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ వాఖ వెల్లడించింది
Ap weather updates
తమిళనాడు ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ వాఖ వెల్లడించింది. తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వర్షాలుపడే అవకాశముందని తెలిపింది.
మోస్తరు వర్షాలు...
ప్రధానంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాతావరణంలో తేమ లేకుండా పోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని చెప్పింది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.