బనకచర్లపై నేడు సీడబ్ల్యూసీకి ఏపీ సర్కార్ నివేదిక
బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాప్కోస్ నివేదిక అందించింది
బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాప్కోస్ నివేదిక అందించింది. బనకచర్లకు వినియోగించేది వరద జలాలేనని పేర్కొంది. 200 టీఎంసీలు గొదావరి వరద జలాలేనని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ నివేదిక ఇచ్చింది. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్ ఆదేశాలను పరిశీలించి సమగ్ర నివేదికను వాస్కోప్ రూపొందించింది. నేడు కేంద్రజలశక్తిశాఖ, సీడబ్యూసీకి నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈనెల 14న బనకచర్లపై కేంద్రంతో చంద్రబాబు చర్చించనున్నారు.
పోలవరం అధారిటీ మాత్రం...
బనకచర్లపై పోలవరం అథారిటీ అభిప్రాయం సీడబ్యూసీ కోరిన నేపథ్యంలో పోలవరం రెండోదశ తర్వాతే ఆలోచిస్తామని.. సీడబ్యూసీకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేఖ రాసింది. రెండు ప్రాజెక్ట్‌ల డీపీఆర్ లలో మార్పులు అవసరమన్న పోలవరం ప్రాజెక్టు అధారిటీ అభిప్రాయపడింది. పోలవరం రెండోదశలో 45.72 మీటర్ల స్థాయికి.. నీటిని నిల్వచేశాకే అనుసంధానంపై ఆలోచిస్తామని చెప్పింది.