ప్రారంభమైన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక
కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కడప జిల్లాలో జరిగే ఈ రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికలను అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. రెండు స్థానాలకు గాను మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
రెండు చోట్ల పోలీసుల భారీ బందోబస్తు...
పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందుల జడ్పీటీసీ నియోజకవర్గంలో పదిహేను పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించి ముప్ఫయి పోలింగ్ కేంద్రాల్లో ఇరవై నాలుగు వేల మంది ఓటర్లుతమ ఓటును వినియోగించుకోవాల్సి ఉంది. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. వెయ్యి మందికిపైగా పోలీసులు ఈ ఉప ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు.