Andhra Pradesh : నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల నాలుగు రోజులుపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాప్తంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది
ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల నాలుగు రోజులుపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాప్తంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కీలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, సీతారామరాజు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
తీరం వెంట బలమైన గాలులు...
అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈరోజు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ శాఖాధికారి వెల్లడించారు.