వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక సివిల్ వివాదంలో దాసరి కిరణ్ ను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు దర్శకత్వం వహించి విడుదల చేశారు.
సివిల్ వివాదంలో...
ఈ సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాత వ్యవహరించారు. అయితే వ్యూహం సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని అప్పట్లో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ సినిమా నిర్మించినందుకు కాదు కానీ, ఒక సివిల్ వివాదంలో దాసరి కిరణ్ కుమార్ పై ఫిర్యాదు అందడంతో పటమట పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు తెలిసింది.