బెజవాడ పాలేరుకు కంపెనీలపై విచారణకు సిద్ధమా?
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని కేశినేని నాని గురించి పరోక్షంగా అన్నారు. వాటి గురించి కూడా నిగ్గు తేలిస్తే బాగుంటుందని కేశినేని నాని సూచించారు. వైసీపీ అధినేత జగన్‌తో రాజ్ కేసిరెడ్డికి సాన్నిహత్యం ఉందని, అందుకే రాజ్ కేసిరెడ్డిని దూరంగా పెట్టానని కేశినేని చిన్ని తెలిపారు.
సీబీఐ విచారణకు సిద్ధమా?
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 3200 కోట్ల రూపాయల విలువైన లిక్కర్‌స్కామ్ జరిగిందని, తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నవ్యక్తే దీనికి సూత్రధారి అని కేశినేని చిన్ని అన్నారు. కేశినేని నాని చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని, సీబీఐ విచారణకు జగన్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. కాగా గత కొద్దిరోజులుగా కేశినేని నాని, చిన్నిల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.