Kesineni : నానికి చిన్ని స్ట్రాంగ్ కౌంటర్
విజయవాడ ఎంపీ కేశినాని చిన్ని తన సోదరుడు కేశినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
విజయవాడ ఎంపీ కేశినాని చిన్ని తన సోదరుడు కేశినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేశినేని నాని తనపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆయన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేశినేని చిన్ని అన్నారు. తనపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని, ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమీ లేకుండానే విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జగన్ కోవర్టుగా...
జగన్ కోవర్టుగా కేశినేని నాని పనిచేస్తున్నారన్న కేశినేని చిన్ని తనకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధాలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తమ మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయని చెబుతున్న నాని, అందుకు సంబంధించిన ఆధారాలు ఎందుకు బయటపపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని తాను పెద్దగా పట్టించుకోనని కేశినేని చిన్ని అన్నారు.