నేడు సిట్ ఎదుటకు విజయసాయిరెడ్డి

నేడు సిట్‌ విచారణకు విజయసాయిరెడ్డి హాజరుకానున్నారు. లి

Update: 2025-04-18 05:06 GMT

నేడు సిట్‌ విచారణకు విజయసాయిరెడ్డి హాజరుకానున్నారు. లిక్కర్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే విజయసాయిరెడ్డికి నోటీసులు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో నేడు సిట్‌ విచారణకు హాజరుకావాలని విజయసాయిరెడ్డిని కోరారు. వాస్తవానికి నిన్ననే విజయసాయిరెడ్డి సిట్ విచారణకు వస్తానని చెప్పారు.

నిన్ననే హాజరు కావాల్సి ఉన్నా...
అయితే అనివార్య కారణాలతో తాను హాజరు కాలేకపోతున్నానని సిట్ అధికారులకు సమాచారం అందించారు. నేడు విజయసాయిరెడ్డి సిట్ పోలీసుల ఎదుటకు విచారణకు హాజరయ్యే అవకాశముంది. మద్యం స్కామ్ లో విజయసాయిరెడ్డి కీలకంగా మారనున్నారు. దీంతో పాటు నేడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనను కూడా విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. రేపు సిట్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని మిథున్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు.


Tags:    

Similar News