నేడు కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తీర్పు

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది.

Update: 2025-04-09 02:26 GMT

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై నెల్లూరు పోలీసులు మైనింగ్ ను అక్రమంగా రవాణా చేశారని ఆయనపై కేసు నమోదయింది. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కాకాణి గోవర్థన్ రెడ్డిపై నమోదయింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది.

తెల్లరాయి అక్రమ రవాణా....
కాకాణి గోవర్థన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి తెల్లరాయిని అక్రమ రవాణా చేశారని అందిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదయింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు కావడంతో ఆయన తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారించి నేడు తీర్పు వెలువరించనుంది.


Tags:    

Similar News