నేడు వంశీ బెయిల్ పిటీషన్ పై తీర్పు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పై నేడు తీర్పు రానుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పై నేడు తీర్పు రానుంది. వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు నూజివీడుకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో పాటు మిగిలిన న్యాయస్థానాల్లో వల్లభనేని వంశీపై నమోదయిన కేసుల విచారణ జరగనుంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ పై నేడు నూజివీడు కోర్టు తీర్పు వెలువరించనుంది.
అక్రమ మైనింగ్ కేసులో...
అక్రమ మైనింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. మైనింగ్ కేసులోనూ పిటీ వారెంట్ నేటి వరకూ అమలు చేయబోమని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు తెలిపింది. వల్లభనేని వంశీపై వరసగా కేసులు నమోదవుతుండటంతో తనకు ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.