వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు వల్లభనేనివంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారించింది. అయితేవల్లభనేని వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెజవాడ మాచవరం పీఎస్‌లో వంశీపై హత్యాయత్నం కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ముందస్తు బెయిల్ విషయంలో...
ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్ వేశారు. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ వరసగా కేసులు నమోదు చేస్తుందని వల్లభనేని వంశీ తరుపున న్యాయవాది వాదించారు. ప్రభుత్వం కూడా తమ తరుపున వాదనలు వినిపించింది. అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.