అమరావతికి పియూష్ గోయల్ రాక

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అమరావతికి రానున్నారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో పీయూష్ గోయల్ సమావేశం అవుతారు

Update: 2025-06-15 02:53 GMT

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అమరావతికి రానున్నారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో పీయూష్ గోయల్ సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిణామలతో పాటు పొగాకు రైతుల సమస్యలపై చర్చించనున్నారు. పొగాకు రైతులు గత కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పియూష్ గోయల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పొగాకు రైతుల సమస్యలపై...
చంద్రబాబుతో సమావేశం అనంతరం కేంద్రమంత్రి పియూష్ గోయల్ గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడ పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో పీయూష్ గోయల్ సమీక్ష నిర్వహించనున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వనున్నారు.


Tags:    

Similar News