తిరుమలలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు దర్శించుకున్నారు. ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పూజారులు తీర్థప్రసాదాలను అందచేశారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ కి దగ్గరుండి ప్రత్యేక దర్శనాన్ని చైర్మన్ బీఅర్ నాయుడు చేయించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చర్చించిన పియూష్ గోయల్ తర్వాత పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు అధికారులతో సమావేశమయ్యారు.
ప్రత్యేక దర్శనం చేసుకుని...
అనంతరం తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పీయూష్ గోయల్ కు పండితులు వేదాశీర్వచనం చేశారు. శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. కేంద్రమంత్రి వెంట శ్రీవారి సేవలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, టిజీ భరత్ పాల్గొన్నారు.