చంద్రబాబుతో నేడు కిషన్ రెడ్డి లంచ్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. లంచ్ మీటింగ్ లో వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి మూడు గంటల వరకు ముఖ్యమంత్రి నివాసం లో లంచ్ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
పదకొండేళ్ల పాలనపై...
మోదీ పదకొండేళ్ల పాలన పై ప్రచారం నిమిత్తం నేడు విజయవాడ లో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. విజయవాడ లో మీడియా సమావేశం లో పాల్గొననున్న కిషన్ రెడ్డిఉదయం 10.15 కి విజయవాడ వచ్చి సాయంత్రం 6.15 కి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. చంద్రబాబు సమావేశంలో రాష్ట్రానికి ఈ నెల 21 ప్రధాని రాకతో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు.