నేడు బెజవాడలో అమిత్ షా షెడ్యూల్ ఇదే

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Update: 2025-01-19 02:12 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొంటారు.

బీజేపీ నేతలతో సమావేశం...
విజయవాడలో బీజేపీ నేతలతో కూడా అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై నేతలతో అమిత్ షా చర్చించనున్నారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై అమిత్ షా ప్రధానంగా నేతలతో చర్చించే అవకాశముంది. తర్వాత జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News