Nirmala Sitharaman : రేపు విశాఖకు నిర్మలా సీతారామన్
రేపు విశాఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు.
రేపు విశాఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమానికి నిర్మలాసీతారమన్ హాజరు కానన్నారు. జీఎస్టీ సంస్కరణల కారణంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలను వివరించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కొత్త జీఎస్టీతో...
ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీనిపై అవగాహన పెంచడానికి, ప్రజల్లో చైతన్యం నింపేందుకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అలగే స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్‌లో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.