Bus Accident : దీపావళి పండగకు వచ్చి బయలుదేరి..మృత్యువు ఒడికి
కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజీనీర్లు ఉన్నట్లు గుర్తించారు
కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజీనీర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి ఈ ప్రమాదంలో మరణించారు. వీరిద్దరూ బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల హైదరాబాద్ లోని మేనమామ ఇంటికి వచ్చారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ఈబస్సు ఎక్కి ధాత్రి ప్రాణాలు కోల్పాయారు.
ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు...
తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్త కొండూరుకు చెందిన అనూషరెడ్డి కూడా ఈ ప్రమాదంలో మరణించారు. దీపావళి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు అనూషరెడ్డి తన స్వగ్రామానికి వచ్చారు. పండగ పూర్తయిన తర్వాత తిరిగి సాఫ్ట్ వేర్ కంపెనీలో విధుల్లో చేరేందుకు రాత్రి ఆమె వేమూరి కావేరి బస్సులో బయలుదేరారు. అనూషరెడ్డి ఖైరతాబాద్ లో ఈ బస్సు ఎక్కారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.