Road Accident : శబరిమలకు వెళ్లి ఇద్దరు ఏపీ వాసుల మృతి
శబరిమలకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించారు.
శబరిమలకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించారు. మృతులిద్దరూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీర రామచంద్రాపురం, పెదంచలకు చెందిన ఆరుగురు అయ్యప్ప మాల వేసుకుని శబరిమల దర్శనానికి కారులో బయలుదేరి వెళ్లారు.
అయ్యప్పదర్శనానికి వెళ్లి...
అయితే శబరిమలలో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో రామేశ్వరం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్, సాయి మరణించారు. మరొక ముగ్గురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను శ్రీకాకుళంలోని సొంత ప్రదేశాలకు తీసుకు వచ్చేందుకు సహాయక చర్యలను చేపట్టారు.