ముంబయి నటి వేధింపుల కేసులో నేడు కీలక పరిణామం

నేడు సీఐడీ కార్యాలయానికి ఇద్దరు ఐపీఎస్ అధికారులు వచ్చే అవకాశం ఉంది.

Update: 2025-05-05 02:45 GMT

నేడు సీఐడీ కార్యాలయానికి ఇద్దరు ఐపీఎస్ అధికారులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎస్ అధికారులు కాంతిరాణాటాటా, విశాల్ గున్నీకి సీఐడీ నోటీసులు జారీ చేయడంతో వారు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ముంబయి నటి వేధింపులపై నమోదైన కేసులో నేడు విచారణకు రావాలని నోటీసులను ఇద్దరికీ సీఐడీ జారీ చేసింది.

మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు...
కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు గతంలో ముంబయి నటి అరెస్టు చేసి వేధించారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు ముంబయి నటిని అరెస్టు చేసిన కాంతిరాణాటాటా, విశాల్ గున్నిని కూడా సీఐడీ అధికారులు విచారించే అవకాశముంది.


Tags:    

Similar News