Ttd : టీటీడీ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు?

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల్లో సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2022-02-25 04:31 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల్లో సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు సులువుగా స్వామి వారి దర్శనం దొరకడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ మూడు రోజుల్లో అదనంగా స్వామి వారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది.

అదనంగా టోకెన్లు.....
ఇటీవల పాలకమండలిలో చర్చ వివాదంగా మారడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా సామాన్య భక్తులు స్వామి వారిని దర్శించుకునే వీలుకలుగుతుంది. రోజుకు ముప్ఫయి వేల సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది. ఈ నిర్ణయంతో టోకెన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. ఈ మూడు రోజుల్లో వీఐపీలకు కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయిస్తారు.


Tags:    

Similar News