జగన్ వాహనం తనిఖీ చేస్తే ఏం బయపడిందంటే?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వాహనాన్నిరవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు

Update: 2025-06-27 07:48 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వాహనాన్నిరవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు జగన్ వాహనాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. సింగయ్య మృతి పై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎంవీఐ అధికారులు...
జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా పోలీసు కార్యాలయం లో ఉంచిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఏపీ 40 డీహెచ్ 2349 వాహనం ఫిట్ నెస్ ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బయటపడిన విషయాలను నివేదిక రూపంలో అందించనున్నారు.


Tags:    

Similar News